Home గాసిప్స్ ఈ రీమేక్ కి ఇంత పెట్టారా….మైండ్ బ్లాంక్!!

ఈ రీమేక్ కి ఇంత పెట్టారా….మైండ్ బ్లాంక్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచినా సైకో థ్రిల్లర్ మూవీ రాక్షసుడు తెలుగు లో కూడా ఒరిజినల్ ని ఏమాత్రం చెడగొట్టకుండా అద్బుతమైన స్క్రీన్ ప్లే తో చాలా బాగా డీల్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి సినిమా ను హిందీ లో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేస్తున్నామని అనౌన్స్ చేయగా…

హిందీ లో ఇంకా బాగా తీస్తారని అందరూ అనుకున్నారు కానీ జస్ట్ OTT డీల్ కోసం ఈ రీమేక్ ను ఒప్పుకున్న అక్షయ్ కుమార్ తక్కువ టైం లోనే రీమేక్ ను కంప్లీట్ చేయగా ఒరిజినల్ తో పోల్చితే రన్ టైం ని తగ్గించి…

ఒరిజినల్ వర్షన్ లో ఉన్న ఫీల్ ని మొత్తం చెడగొట్టి రీమేక్ చేయగా సినిమా ఒరిజినల్ వర్షన్ తో కంపేర్ చేస్తే అసలు ఏ మాత్రం ఇంప్రెస్ చేయలేక పోయింది. కాగా ఈ సినిమాను అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ ని పక్కకు పెడితే కేవలం 30 కోట్ల లోపు బడ్జెట్ లోనే కంప్లీట్ చేశారని సమాచారం.

ఇక సినిమా డిజిటల్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవ్వగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఈ సినిమా కోసం ఏకంగా 135 కోట్ల రేటుని చెల్లించి డిజిటల్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేశారట. ఈ వార్తా సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటికి రాగా. అసలు పెద్దగా పబ్లిసిటీ లాంటివి కూడా ఏమి చేయకుండా ఇంత రేటు పెట్టి ఈ రీమేక్ ని చూడకుండా…

ఎలా కొన్నారు అంటూ అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు OTTలో డైరెక్ట్ రిలీజ్ లు ఆగిపోగా ఫస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాతే కొంటామని కండీషన్ పెడుతున్నాయి OTT కంపెనీలు. కానీ అక్షయ్ కుమార్ తో ముందే అగ్రిమెంట్ చేసుకోవడంతో నామాత్రపు రీమేక్ గా చేసి నిర్మాతలు కోట్లు సొంతం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here