Home న్యూస్ ది ఘోస్ట్ టోటల్ బిజినెస్…హిట్ కొట్టాలి అంటే ఎంత కావాలి!!

ది ఘోస్ట్ టోటల్ బిజినెస్…హిట్ కొట్టాలి అంటే ఎంత కావాలి!!

0

ఈ ఇయర్ సంక్రాంతికి నాగ చైతన్యతో కలిసి కింగ్ నాగార్జున బంగార్రాజు సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు, ఆ సినిమా తర్వాత ఇప్పుడు సోలో హీరోగా నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా రిలీజ్ కానుండగా పోటి లో మెగాస్టార్ గాడ్ ఫాదర్ కాంపిటీషన్ లో ఉన్నప్పటికీ ఒకే రోజున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అయ్యింది, కాగా సినిమా జానర్ కంప్లీట్ గా….

న్యూ ఏజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోగా పండగ టైం లో ఫ్యామిలీ ఆడియన్స్ భారీ సంఖ్యలో ఎంతవరకు వస్తారు అన్నది సినిమాకి వచ్చే టాక్ ని బట్టి చెప్పొచ్చు. ఇక సినిమా బిజినెస్ పరంగా మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో మంచి బిజినెస్ నే…

ఓవరాల్ గా సొంతం చేసుకుంది అని చెప్పాలి. మేకర్స్ మరీ ఆశకు పోకుండా రీజనబుల్ రేట్స్ కే సినిమాను అన్ని ఏరియాలలో అమ్మగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ వస్తే పోటి ఉన్నప్పటికీ ఈ బిజినెస్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. ది ఘోస్ట్ సినిమా ఓవరాల్ గా…

సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి మేజర్ ఏరియాల వారిగా గమనిస్తే…
👉Nizam – 5.50Cr
👉Ceeded – 2.50Cr
👉Andhra – 8Cr
Total AP TG:- 16.00CR
👉KA – 65L
👉Hindi+ROI – 2Cr(Valued)
👉OS – 2.5Cr
Total WW Business – 21.15CR
ఇదీ వరల్డ్ వైడ్ గా నాగార్జున ది ఘోస్ట్ సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క… మొత్తం మీద సినిమా…

ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 22 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, హిందీ అండ్ ఇతర భాషల్లో కూడా డబ్ అయిన సినిమా అక్కడ నుండి ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here