టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా దసరా బరిలో పోటి లో రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి ఏమాత్రం కూడా అనుకున్న రేంజ్ లో అయితే రెస్పాన్స్ రాలేదు అనే చెప్పాలి. కచ్చితంగా సోలో హీరోగా నాగార్జున కి సినిమా మంచి హిట్ గా నిలుస్తుంది అనుకున్నా కానీ భారీ డిసాస్టర్ గా నిలిచి నిరాశ పరిచింది.
అక్కడ మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించ లేక పోయిన ఈ సినిమా రీసెంట్ గా అన్ని భాషల్లో డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది, నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ యాక్షన్ సీన్స్ కి మంచి రెస్పాన్స్ దక్కగా…
ఇప్పుడు వ్యూవర్ షిప్ పరంగా కూడా అదర గొడుతూ దూసుకు పోతున్న ది ఘోస్ట్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. తెలుగు వర్షన్ టాప్ లో ట్రెండ్ అవుతూ ఉంటె మరో పక్క హిందీ వర్షన్ కూడా….
టాప్ 3 లో ట్రెండ్ అవుతూ రచ్చ రచ్చ చేస్తుంది, జనాలు థియేటర్స్ లో చూడక పోవడంతో అక్కడ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడ డిజిటల్ లో మాత్రం ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో మంచి రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.