బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ 2 మూవీస్ కూడా అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన విషయం తెలిసిందే. అయినా కానీ రవితేజ లేటెస్ట్ మూవీ ధమాకా మీద ట్రేడ్ లో ఆడియన్స్ లో పర్వాలేదు అనిపించేలా అంచనాలు ఉండగా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఉన్నంతలో భారీగానే క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. మొత్తం మీద సినిమా….
రవితేజ రీసెంట్ టైం లో ఫామ్ లో లేకున్నా కానీ ఓవరాల్ గా మంచి బిజినెస్ నే సొంతం చేసుకుంది. బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ పడ్డా కానీ సినిమా కి టోటల్ వరల్డ్ వైడ్ గా 18.30 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం అయ్యింది..
మొత్తం మీద ఏరియాల వారి బిజినెస్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 5.5Cr
👉Ceeded: 2.5Cr
👉Andhra: 8Cr
AP-TG Total:- 16.00CR
👉Ka+ROI+OS: 2.30Cr
Total – 18.30CR
కొన్ని ఏరియాలలో సినిమా ఓన్ గా రిలీజ్ కానుండగా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ ఈ విధంగా ఉండగా…
ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ మార్క్ ని అందుకోవాలి అంటే మినిమమ్ 19 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. పోటిలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ కలెక్షన్స్ ని పోటిలో ఎంతవరకు అందుకుని రవితేజకి మంచి కంబ్యాక్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.