బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాలయ్య కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఆ ఓపెనింగ్స్ రికార్డులను ఇప్పుడు బాలయ్య లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా ఓపెనింగ్స్ పరంగా బ్రేక్ చేసి సరికొత్త ఓపెనింగ్స్ రికార్డు ను బాలయ్య కెరీర్ లో నమోదు చేస్తూ దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. బాలయ్య కెరీర్ లో…
ఇప్పుడు మొట్ట మొదటి సారిగా తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకోవడం ఖాయమని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకా ఎక్కువ ఉండటం ఖాయం. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మరోసారి బాలయ్య కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేస్తూ 42 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ లెక్కలు బాగుంటే 45 కోట్ల మార్క్ ని అధిగమించడం కూడా ఖాయం. ఇది వరకు బాలయ్య మూవీస్ ఏవి కూడా ఫస్ట్ డే 30 కోట్ల మార్క్ ని అందుకోలేదు.
అలాంటిది ఇప్పుడు ఏకంగా వరల్డ్ వైడ్ గా 45 కోట్ల మార్క్ కి మించి ఓపెనింగ్స్ అందుకోబోతున్న వీర సింహా రెడ్డి ఓవరాల్ గా అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు ఇదే రేంజ్ లో ఉంటాయో అంతకన్నా మించి ఉంటాయో చూడాలి. ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో రికార్డులు అన్నీ చెల్లాచెదురు చేసి కొత్త రికార్డులు భారీ మార్జిన్ తో నమోదు చేయబోతుంది.