బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని లాభాలను భారీగా పెంచుకోగా సినిమా వర్కింగ్ డేస్ లో స్లో అయినా మిగిలిన సినిమాలతో పోల్చితే బెటర్ గానే పెర్ఫార్మ్ చేస్తుంది. సినిమా 12వ రోజు ఉన్నంతలో పర్వాలేదు అనిపించగా ఇప్పుడు 13వ రోజున పఠాన్ సినిమాతో పోటి కూడా ఉండటంతో మరింత స్లో అయింది.
ఓవరాల్ గా 35% రేంజ్ లో ఆన్ లైన్ బుకింగ్స్ డ్రాప్ అవ్వగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ డ్రాప్స్ ఉండే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఒకవేళ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ పెరగవచ్చు… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
కలెక్షన్స్ ఇంకొంచం పెరగవచ్చు…. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పఠాన్ రిలీజ్ ఉన్నా ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తూ జోరుని కొనసాగిస్తుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తుందా లేక ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో చూడాలి.