Home న్యూస్ పఠాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్…రికార్డులు బ్రేక్ అయ్యేలా ఉందే!!

పఠాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్…రికార్డులు బ్రేక్ అయ్యేలా ఉందే!!

0

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇచ్చిన లేటెస్ట్ మూవీ పఠాన్ భారీ లెవల్ లో ఇండియాలో ఓవర్సీస్ లో రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా ఒక్క నైజాం ఏరియాలోనే రిలీజ్ కి ముందు రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 3.2 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి. ఇక ఇండియాలో…

రిలీజ్ కి ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 30 కోట్ల మార్క్ ని అందుకుని ఊచకోత అంటే ఇదే అనిపించే రేంజ్ లో దుమ్ము లేపిన సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత టాక్ పాజిటివ్ గానే ఉండటంతో ఇప్పుడు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా మొదటి రోజు ఇండియాలో ఇప్పుడు 50 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్ని చోట్లా ఫైనల్ లెక్కలు అంచనాలను ఇంకా మించిపోతే…

52 కోట్ల నుండి 54 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ చాన్స్ కూడా ఉందని అంచనా వేస్తూ ఉండటం విశేషం. ఇదే కనుక జరిగితే కేజిఎఫ్2 ఓపెనింగ్ డే రికార్డులు బాలీవుడ్ లో గల్లంతు అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు. మరి అఫీషియల్ డే 1 కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here