బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి దుమ్ము లేపగా సినిమా ఆల్ మోస్ట్ ఇప్పుడు పరుగును పూర్తీ చేసుకోగా కొన్ని ఏరియాలలో మాత్రం సినిమా కి మొత్తం మీద…
కొంచం మైనర్ లాస్ లు వచ్చాయి అని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా బిజినెస్ ను దాటేసి లాభాలను సొంతం చేసుకున్నా కానీ తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి వైజాగ్, కృష్ణా మరియు వెస్ట్ ఏరియాలలో లాస్ లు కొద్ది వరకు సొంతం చేసుకుంది ఈ సినిమా…
మొత్తం మీద వైజాగ్ లో సినిమా బిజినెస్ వాల్యూ 9 కోట్లు కాగా సినిమా ఇక్కడ 8.56 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది. ఇక వెస్ట్ ఏరియాలో 5 కోట్ల బిజినెస్ కి సినిమా మొత్తం మీద 4.92 కోట్ల దాకా షేర్ ని సాధించి చాలా మైనర్ లాస్ ని ఇక్కడ సొంతం చేసుకోగా….
కృష్ణా ఏరియాలో 5 కోట్ల బిజినెస్ వాల్యూకి టోటల్ గా 4.75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కొంచం లాస్ ను అందుకుంది. మిగిలిన చోట్ల మంచి లాభాలనే సొంతం చేసుకున్న సినిమా ఈ 3 ఏరియాల్లో ఇలా మైనస్ లాస్ లను సొంతం చేసుకుంది… అయినా ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసింది ఈ సినిమా..