Home న్యూస్ హిస్టరీ క్రియేట్ చేసిన నాటు నాటు….ఆస్కార్ తో ఆల్ టైం రికార్డ్!!

హిస్టరీ క్రియేట్ చేసిన నాటు నాటు….ఆస్కార్ తో ఆల్ టైం రికార్డ్!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ ఎస్ ఎస్ రాజమౌళి ఎపిక్ డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూ వస్తున్న ఈ సినిమా ఇప్పుడు దేశం మొత్తం గర్వపడే విధంగా ఎపిక్ రికార్డ్ ను సృష్టించింది. సినిమా లోని నాటు నాటు సాంగ్ కి…

RRR Movie 6 Days Total World Wide Collections!

అనేక అవార్డులు ఆల్ రెడీ సొంతం అవ్వగా ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ను దక్కించుకుని సాంగ్ విషయంలో ఆస్కార్ ను అందుకున్న మొట్ట మొదటి ఏసియన్ మూవీ గా ఆల్ టైం రికార్డ్ ను సృష్టించి…

టోటల్ గా దేశం మొత్తం గర్వపడేలా చేసింది… ఇండియా నుండి అఫీషియల్ ఎంట్రీ దక్కి ఉంటే ఇంకా వివిధ క్యాటగిరీలలో కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీ నమోదు అయ్యేది కానీ అఫీషియల్ ఎంట్రీ కాక పోయినా టీం అంతా కలిసి సినిమాను విస్తృతంగా ప్రచారం చేయడంతో ఏకంగా ఆస్కార్ నామినేషన్ ని సొంతం చేసుకున్న…

నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో బిగ్ మూవీస్ తో పోటి పడీ మరీ అవార్డును గెలుచుకుని సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి. ఇక ఇండియాకి మరో అవార్డ్ కూడా దక్కింది. బెస్ట్ డాక్యుమెంటరీ క్యాటగిరీలో ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ ను అందుకుని మరో సంచలనం సృష్టించడం విశేషమని చెప్పాలి.

RRR Movie 5 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here