రీసెంట్ గా జరిగిన ఆస్కార్ వేడుక ఇండియా వైడ్ గా కూడా విశేష స్పందనని తెచ్చుకుని ఓవరాల్ గా ఆస్కార్ వ్యూవర్ షిప్ పరంగా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయడంలో ఉపయోగ పడింది. కాగా నాటు నాటు సాంగ్ కి అవార్డ్ రావడంతో అందరి లోనూ ఓ రేంజ్ లో సంతోషం వెల్లువెత్తగా నామినేట్ అయిన ఒక కేటగిరీలోనే అవార్డ్ ను అందుకుని ఆర్ ఆర్ ఆర్ సంచలనం సృష్టించగా…
మొత్తం మీద ఆస్కార్ వేడుకల్లో అత్యధిక నామినేషన్స్ ని సొంతం చేసుకున్న సినిమా అత్యధిక అవార్డులను దక్కించుకున్న సినిమా ఏది అన్నది ఆసక్తిగా మారగా… ఈ ఏడాదికి ఎవ్రీతింగ్ ఎనీ వేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా 11 నామిషేషన్స్ ని సొంతం చేసుకుని అందులో 7 అవార్డులను గెలుచుకుంది…
ఓవరాల్ గా ఎక్కువ అవార్డులను గెలుచుకున్న మూవీస్ లో బెన్-హర్(1959), టైటానిక్(1997) మరియు ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్(2003) సినిమాలు 11 అవార్డులను దక్కించుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అని చెప్పాలి… ఈ సినిమాల్లో కూడా…
టైటానిక్ సినిమా ఏకంగా 14 కేటగిరిలలో నామినేట్ అయ్యి ఆల్ టైం హైయెస్ట్ నామినేషన్స్ ని దక్కించుకుని ఎపిక్ రికార్డ్ ను సృష్టించగా ఇప్పటి వరకు కూడా ఈ నామినేషన్స్ రికార్డ్ ను ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేక పోయింది. ఫ్యూచర్ లో కూడా ఈ రికార్డ్ బ్రేక్ అవ్వడం కష్టమే అంటున్నారు.