ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన నోటబుల్ తెలుగు మూవీ ఫలానా అబ్బాయి…ఫలానా అమ్మాయి…. అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో నాగశౌర్య మరియు మాళవిక నాయర్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా చాలా సైలెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించింది అన్న విషయాలు తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… కథ మొత్తం 2000 టైం నుండి 2010 వరకు జరుగుతుంది. ప్రేమలో పడిన జంట విడిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు, చివరికి ఎలా కలిశారు అన్న పాయింట్ తో తెరకెక్కిన స్టొరీనే ఫలానా అబ్బాయి…ఫలానా అమ్మాయి సినిమా….
అవసరాల శ్రీనివాస్ సినిమాలలో డైలాగ్స్ చాల సింపుల్ గా ఆకట్టుకునేలా ఉంటాయి, ఊహలు గుసుగుసలాడే సినిమా అలానే బాగా మెప్పించాగా జోఅచ్చుతానంద కూడా కొద్ది వరకు మెప్పించింది, ఇక ఈ సినిమాలో పార్టు పార్టులుగా మెప్పించినా కానీ చాలా నెమ్మదిగా సాగే కథనం, ఎప్పుడు ఏ ఇయర్ లో ఉన్నామా అన్న కన్ఫ్యూజర్ ల నడుమ ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేసింది సినిమా…
కానీ ఫస్టాఫ్ వరకు కథ పడుతూ లేస్తూ పర్వాలేదు అనిపించేలా సాగినా సెకెండ్ ఆఫ్ లో ఒక పాయింట్ చుట్టూ కథని సాగదీయడంతో మరింత బోర్ ఫీల్ అవుతారు ఆడియన్స్, క్లైమాక్స్ లో కొద్ది వరకు పర్వాలేదు అనిపించేలా మెప్పించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోవడంతో పెద్దగా హెల్ప్ ఏమి అవ్వలేదు… లీడ్ పెయిర్ ఇద్దరూ బాగా నటించగా…
నాగశౌర్య ఎప్పటిలానే మెప్పించాడు, డిఫెరెంట్ గెటప్స్ తో ఆకట్టుకోగా హీరోయిన్ మాళవిక కొన్ని సీల్స్ లో అద్బుతంగా నటించింది. మిగిలిన యాక్టర్స్ ఓకే, సంగీతం యావరేజ్ గా ఉంది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే నిదానంగా సాగుతాయి. ఇక డైరెక్టర్ గా అవసరాల శ్రీనివాస్ మొదటి సినిమా మ్యాజిక్ ని ఈ సినిమాతో కూడా అందుకోలేక పోయాడు… కానీ ఓపికతో చూస్తె కొంచం కష్టమే అయినా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది సినిమా. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్…