Home గాసిప్స్ చిన్న సినిమా అనుకున్నారు…బడ్జెట్ ఇంత అయిందా!!

చిన్న సినిమా అనుకున్నారు…బడ్జెట్ ఇంత అయిందా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ భారీ విజయాలు ఏమి లేక పోయినా కానీ ఉన్నంతలో చేసిన సినిమాలతో ఆడియన్స్ ను పర్వాలేదు అనిపించేలా ఆకట్టుకుంటూ వస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కి మూవీ తో ఇప్పుడు ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమాను తానె హీరోగా, డైరెక్టర్ గా అలాగే నిర్మాతగా కూడా మారి నిర్మించగా సినిమా…

ఇప్పుడు ఉన్నంతలో మంచి అంచనాల నడుమే ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. తెలుగు వర్షన్ 8 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా బడ్జెట్ 10 కోట్ల లోపే అయ్యి ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ…

సినిమాను క్వాలిటీగా భారీగా రూపొందించిన విశ్వక్ సేన్ తన రెమ్యునరేషన్ ని యాక్టర్ గా డైరెక్టర్ గా పూర్తిగా పక్కకు పెట్టేసి ఏకంగా 18 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టి సినిమాను నిర్మించినట్లు తెలుస్తుంది ఇప్పుడు. ఇక ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సినిమా కి ఇప్పుడు ఆల్ మోస్ట్…

20 కోట్ల రేంజ్ బడ్జెట్ అయిందని తెలుస్తుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ తో చాలా మొత్తం రికవరీ అవ్వగా థియేట్రికల్ రన్ లో వచ్చేవి అంచనాలను అందుకుంటే మంచి లాభాలే హీరోకి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here