బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ధమ్కీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకోగా రెండో రోజు లో కూడా సినిమా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజులో అడుగు పెట్టగా మొత్తం మీద మొదటి 2 షోలకు 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ తిరిగి….
ఈవినింగ్ షోల నుండి గ్రోత్ ని చూపిస్తూ ఉండగా సినిమా మొత్తం మీద మూడో రోజు మరోసారి డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. మొత్తం మీద 3వ రోజు ఇప్పటి వరకు ట్రాక్ చేసిన థియేటర్స్ నుండి గ్రాస్ ఆల్ మోస్ట్ 85 లక్షల దాకా ఉండగా…
ఈవినింగ్ షోల బుకింగ్స్ కూడా బాగానే ఉండటంతో మొత్తం మీద ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగానే ఉండేలా ఉండటంతో…
సినిమా 90 లక్షల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.1 కోట్ల నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. కంప్లీట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై ఈ లెక్క పెరుగుతుందో తగ్గుతుందో చూడాలి. ఇక మొత్తం మీద 3 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.