Home న్యూస్ రిలీజ్ కి 6 రోజుల ముందే 100K ఔట్….నాని ఊరమాస్ జాతర!!

రిలీజ్ కి 6 రోజుల ముందే 100K ఔట్….నాని ఊరమాస్ జాతర!!

0

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ఏ సినిమా కి లేనంత హైప్ ను ఎక్స్ లెంట్ ప్రమోషన్స్ ని జరుపుకుని ఆడియన్స్ ముందుకు ఈ నెల 30న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న పాన్ ఇండియా మూవీ దసరా… ఎక్స్ లెంట్ బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సెన్సార్ తో పాటు అన్ని పనులను కూడా పూర్తీ చేసుకోగా ఇప్పుడు భారీ లెవల్ లో రిలీజ్ కి…

సిద్ధం అవుతూ ఉందని చెప్పాలి. సినిమా ఒక్క USA లోనే కేవలం తెలుగు వర్షన్ కే ఆల్ మోస్ట్ 600 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ కానుండగా అన్ని వర్షన్ లు కలిపి 850 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ను…

ఆల్ రెడీ ఓపెన్ చేయగా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా రిలీజ్ కి ఇంకా 6 రోజులు ఉండగానే సినిమా అమెరికాలో 1 లక్ష అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది. రిలీజ్ కి ఇంకా టైం ఉన్న నేపధ్యంలో నాని కెరీర్ లోనే…

ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది వరకు నాని నటించిన MCA మూవీ 3 లక్షలకు పైగా డాలర్స్ తో ఓపెన్ అవ్వగా ఇప్పుడు ఆ ఓపెనింగ్స్ రికార్డ్ ను అవలీలగా దసరా సినిమా బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here