బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కొత్త సినిమా రిలీజ్ అయ్యి చాలా టైమే అవుతుంది. రెండేళ్ళ క్రితం అల్లుడు అదుర్స్ సినిమాతో వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత బాలీవుడ్ లో తెలుగు ఛత్రపతి సినిమా రీమేక్ లో నటిస్తున్నట్లు అనౌన్స్ చేయగా అప్పటి నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అఫీషియల్ అప్ డేట్ ఏమి కూడా ఇప్పటి వరకు రాలేదు కానీ ఇప్పుడు అఫీషియల్ గా…
సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేసి ఎప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతుందో కూడా క్లియర్ గా చెప్పేశారు. వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కూడా టైటిల్ తెలుగుదే కన్ఫాం చేస్తూ ఛత్రపతి అని పెట్టగా సినిమాను ఆడియన్స్ ముందుకు వచ్చే మే నెలలో…
12 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక సినిమా టైటిల్ విషయంలో చాలా టైటిల్స్ ని అనుకున్నారట. కానీ తిరిగి ఛత్రపతికే మొగ్గు చూపారట. ఈ ఒక్క టైటిల్ కోసం ఒరిజినల్ ని రిజిస్టర్ చేయించిన నిర్మాతకి మేకర్స్ ఏకంగా 2 కోట్ల దాకా రేటు చెల్లించి…
ఈ టైటిల్ ని తీసుకున్నారట. హిందీలో ఈ టైటిల్ పాపులర్ అవ్వడంతో వేరే టైటిల్ ఆప్షన్స్ ని అనుకున్నా కానీ ఈ రేటు ఇచ్చి టైటిల్ తీసుకుంటే మరింత రీచ్ ను సినిమా సొంతం చేసుకోవచ్చు అని ఇదే టైటిల్ ని తీసుకున్నారట. ఇక సినిమా సౌత్ భాషల్లో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవ్వబోతుందట. మరి ఈ సినిమాతో బెల్లంకొండ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.