Home గాసిప్స్ నిర్మాత సేఫ్ అవ్వాలంటే…శాకుంతలం ఇంత కలెక్ట్ చేసి తీరాల్సిందే!!

నిర్మాత సేఫ్ అవ్వాలంటే…శాకుంతలం ఇంత కలెక్ట్ చేసి తీరాల్సిందే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ ఫిల్మ్ శాకుంతలం సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా కి తొలి ఆటకే ఆడియన్స్ నుండి నెగటివ్ టాక్ సొంతం అవ్వగా ఏ దశలో కూడా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తేరుకునే అవకాశం అయితే కనిపించడం లేదని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా వలన నిర్మాత కూడా నష్టాలను ఫేస్ చేసే అవకాశం ఉందని…

లేటెస్ట్ గా టాలీవుడ్ లో స్ట్రాంగ్ టాక్ వినిపిస్తుంది. సినిమా కోసం ఆల్ మోస్ట్ 65 కోట్ల రేంజ్ భారీ రేటు చెల్లించి సినిమాను నిర్మించగా సినిమా ను కొన్ని చోట్లా అమ్మినా కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ చేశారు. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని భాషల రైట్స్ కలిపి మొత్తం మీద….

40 కోట్ల రేంజ్ దాకా రికవరీ అయ్యిందని ట్రేడ్ లో టాక్ ఉంది. ఇక సినిమా వాల్యూ బిజినెస్ 18 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 19 కోట్ల మార్క్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. కానీ నిర్మాత సేఫ్ అవ్వాలి అంటే సినిమా థియేట్రికల్ రన్ లో ఎంత లేదన్నా…

25 కోట్లకు పైగా షేర్ ని మినిమమ్ వసూల్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు ఇప్పుడు. 25 కోట్లకు పైగా షేర్ వస్తేనే నిర్మాతలకు బడ్జెట్ రికవరీ అవుతుందని అంటున్నారు. మరి శాకుంతలం సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here