Home న్యూస్ ఏజెంట్ హిందీ రిలీజ్ ఆగిపోయింది….రీజన్ ఇదే!!

ఏజెంట్ హిందీ రిలీజ్ ఆగిపోయింది….రీజన్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ ఏజెంట్ ఆడియన్స్ ముందుకు ఈ నెల 28న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రీసెంట్ గా మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా సినిమా పై ఫుల్ నమ్మకంతో ఉన్నామని చెప్పుకొచ్చారు టీం. కానీ సినిమా హిందీ రిలీజ్ మాత్రం ఆగిపోయింది అని అంటున్నారు ఇప్పుడు… మొదటి నుండి పాన్ ఇండియా మూవీ…

అంటూ చెప్పిన ఏజెంట్ మూవీని ఇప్పుడు సడెన్ గా హిందీ రిలీజ్ ను సడెన్ గా ఆపేసి రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. సినిమా అన్ని భాషల్లో ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నారు అని చెప్పినా ఇప్పుడు రిలీజ్ ను హిందీలో పోస్ట్ పోన్ చేసి త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను…

హిందీలో అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు. దానికి ప్రధాన కారణం, అన్ని భాషల్లో సినిమాను బాగా ప్రమోట్ చేయాలని తెలుగు మలయాళంలో సినిమా రిలీజ్ 28నే ఉండబోతుండగా హిందీలో సినిమాను ప్రమోట్ చేయాలనీ, అలాగే ఈ నెల సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకీ జాన్ సినిమా రిలీజ్ ఉండటంతో…

థియేటర్స్ కూడా అనుకున్న విధంగా దొరికే అవకాశం లేక పోవడంతో సినిమా హిందీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశామని అఖిల్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇక మెయిన్ మార్కెట్ అయిన తెలుగు లో మాత్రం సినిమాను భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారట. ఇక ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here