బాక్స్ ఆఫీస్ దగ్గర సౌత్ నుండి కొన్ని సినిమాలు అన్ని చోట్లా మంచి హిట్స్ గా నిలవడంతో కొంచం బడ్జెట్ ఎక్కువగా పెట్టి తీసిన ప్రతీ సినిమాను పాన్ ఇండియా సినిమాగా మారుస్తున్నారు. రిజల్ట్ ఎలా ఉన్నా పట్టించుకోకుండా ప్రతీ సినిమాను పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ ఊదరగొడుతూ ఉండగా అందులో ఒకటి అరా సినిమాలు తప్పితే చాలా సినిమాలు మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించడం లేదు…
రీసెంట్ సమ్మర్ మూవీస్ నే తీసుకున్నా తెలుగు లో ఓవర్సీస్ లో విరగ కుమ్మేసిన దసరా సినిమా హిందీతో పాటు సౌత్ లో ఇతర భాషల్లో నిరాశ కలిగించింది, కానీ నైజాం అండ్ ఓవర్సీస్ ఓవర్ ఫ్లో ల వలన మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కన్నా కూడా….ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన శాకుంతలం సినిమా అన్ని చోట్లా అద్బుతాలు సృష్టిస్తుంది అంటూ టీం ఓ రేంజ్ లో ఊదరగొట్టారు,
కట్ చేస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు కూడా 10 కోట్ల గ్రాస్ ను కూడా అందుకోలేక పోయింది. తెలుగు రాష్ట్రాలలోనే దిమ్మతిరిగే రిజల్ట్ ను…సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీలో ప్రింట్ ఖర్చులు కూడా రాలేదు, తమిళ్, మలయాళంలో కూడా అట్టర్ ఫ్లాఫ్ అయింది. 10 కోట్ల గ్రాస్ ను కూడా అందుకోలేక పోయిన సినిమా బడ్జెట్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా చెప్పుకోవాలి.
ఇలా ప్రతీ సినిమాను పాన్ ఇండియా అంటూ ఊదరగొట్టకుండా వర్కౌట్ అవుతుంది అన్న నమ్మకం ఉన్న సినిమాలనే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తే కొంచం బెటర్ అని చెప్పాలి… లేదంటే ఇలాంటి సినిమాల రిజల్ట్ వలన కొన్ని మంచి సినిమాలు కూడా పాన్ ఇండియా రిలీజ్ చేసినా ఈ సినిమాల మాదిరిగానే ఆ సినిమాలు ఉంటాయి అనుకుని జనాలు వాటిని పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉంది.