బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ రంజాన్ కి తన సినిమా ఉండేలా చూసుకునే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ రంజాన్ కి ఆడియన్స్ ముందుకు ఆల్ రెడీ అరిగిపోయిన రీమేక్ వీరంని బాలీవుడ్ స్టైల్ లో రీమేక్ చేసి ఇప్పుడు రిలీజ్ చేశాడు, సాంగ్స్, ట్రైలర్ ఇలా ప్రతీ అంశంలో ట్రోల్స్ కి గురి అయిన ఈ సినిమా ఇప్పుడు ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే ఆల్ రెడీ మనం కాటమరాయుడులో చూసిన కథనే… ఇక్కడ బ్యాగ్ డ్రాప్ కొంచం అక్కడక్కడా మార్చి హీరోయిన్ కి తెలుగు నేటివిటీని పెట్టగా తెలుగు-హిందీ మిక్స్ చేసిన డైలాగ్స్ క్రింజ్ మాక్స్ లా అనిపించాయి చాలా చోట్ల…
ఇక సల్మాన్ ఖాన్ తన రోల్ వరకు బాగానే చేసినా కొన్ని ఓవర్ ది టాప్ సీన్స్ సౌత్ మూవీస్ ని మించి పోయి ఉంటాయి. విక్టరీ వెంకటేష్ రోల్ అలాగే సాంగ్ లో మెరిసిన రామ్ చరణ్ లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా కానీ ఎక్కడా కూడా సినిమా ఇంప్రెస్ చేయలేక పోయింది. ఆల్ రెడీ వీరం సినిమాను అలాగే…
కాటమరాయుడు సినిమాలు హిందీలో డబ్ అయ్యి ఉన్నాయి, ఆల్ రెడీ అందుబాటులో ఉండటంతో ఎదో ఒక సినిమా అయినా హిందీ ఆడియన్స్ చూసి ఉంటారు. దాంతో ఒరిజినల్ ని చూసిన ఆడియన్స్ కి సినిమా చాలా చోట్ల అస్సలు ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయలేక పోయింది అని చెప్పాలి…
వీరం, కాటమరాయుడు హిందీ డబ్బింగ్ మూవీస్ ని చూడని ఆడియన్స్ కి సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కి కొద్ది వరకు సినిమా నచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా సినిమా ఒరిజినల్ ని చూసిన ఆడియన్స్ ని అయితే పెద్దగా ఇంప్రెస్ చేయలేదు అనే చెప్పాలి. క్రింజ్ క్రింజ్ అనుకున్న పాటలే వినడానికి కొంచం పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. ఓవరాల్ గా సల్మాన్ నుండి మరో నిరాశకలిగించే సినిమానే కిసీకా భాయ్…కిసీకి జాన్….