యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని చూపించడం లేదు… సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా డ్రాప్స్ ను మరీ ఎక్కువగా కాకున్నా కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సాధిస్తూ…
ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద సినిమా ఇప్పుడు 4వ రోజుతో పోల్చితే 5వ రోజు మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర…
30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా అటూ ఇటూగా ఇప్పుడు 26 లక్షల నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇవి నాగ చైతన్య ప్రీవియస్ మూవీ థాంక్ యు తో పోల్చితే బెటర్ గానే ఉన్నా కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక టోటల్ 5 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.