Home న్యూస్ ఓరినీ…పాపం…సగం లేపేశారుగా…ఇక కష్టమే!

ఓరినీ…పాపం…సగం లేపేశారుగా…ఇక కష్టమే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ మార్కెట్ పై భారీ ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి తన లేటెస్ట్ మూవీ ఛత్రపతి సినిమా భారీగా నిరాశని మిగిలించింది. ప్రమోషన్స్ కి అయిన ఖర్చులను కూడా సరిగ్గా వెనక్కి తీసుకు రాలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ ఫ్లాఫ్ గా నిలవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రిలీజ్ కి ముందు మొత్తం మీద…

2500 వరకు స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేయాలని భావించారు కానీ పోటిలో ది కేరళ స్టొరీ ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపడంతో ఈ సినిమా కి మొత్తం మీద 1500 లోపు స్క్రీన్స్ మాత్రమే దక్కాయి. ఉన్న స్క్రీన్స్ లో కూడా సినిమా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసి ఉంటే…

   

మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని ఉండేది కానీ సినిమా కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ చాలా మిక్సుడ్ గా రావడంతో వీకెండ్ లోనే కేవలం కోటి లోపే నెట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించడం లేదు…

దాంతో ఉన్న స్క్రీన్స్ లో ఆల్ మోస్ట్ సగం వరకు స్క్రీన్స్ ని ఇప్పుడు తగ్గించేశారు. చాలా ఏరియాలో ప్రైమ్ టైం షోలకు జనాలు లేక పోవడంతో ఆ షోలను ఇప్పుడు కేరళ స్టొరీ సినిమాకి కేటాయిస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా పై ఆశలు పెట్టుకుని బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్న బెల్లంకొండకి సినిమా భారీ నిరాశనే మిగిలించబోతుంది ఇప్పుడు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here