హిందీ డబ్బింగ్ మూవీస్ తో హిందీలో తనకంటూ కొంత క్రేజ్ ను సొంతం చేసుకున్నా కూడా ఔట్ డేట్ అయిన ఛత్రపతి సినిమాను రీమేక్ చేసి అక్కడ ఈ సినిమా ఎంట్రీ ఇవ్వాలి అనుకోవడం బెల్లంకొండ శ్రీనివాస్ కి భారీగా ఎదురు దెబ్బ తీసింది అని చెప్పాలి. ఈ సినిమా ఎప్పుడో 18 ఏళ్ల క్రితం రాగా ఆ తర్వాత కానీ అంతకుముందు కానీ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ ఎన్నో వచ్చాయి.
మళ్ళీ అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చిన హిందీ ఛత్రపతి యాక్షన్ పార్ట్ వరకు మాస్ ను మెప్పించే అవకాశం ఉందని నమ్మినా కూడా టేకింగ్ ఏమాత్రం బాలేక పోవడం, మాస్ ఆడియన్స్ కూడా సినిమాని పట్టించుకోలేదు. హిందీ మాస్ సెంటర్స్ లో అయినా సినిమా పెర్ఫార్మ్ చేస్తుంది అనుకున్నా కూడా..
ఎక్కడా మినిమమ్ ఇంపాక్ట్ ని చూపించలేదు ఈ సినిమా… సినిమా ప్రమోషన్స్ రిలీజ్ కి వారం ముందే చేయగా రిలీజ్ కి 2 వారాల ముందు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను ఇంకా ముందే రిలీజ్ చేసి, మాస్ సెంటర్స్ లో సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేసి ఉండాల్సింది. ఇక వివి వినాయక్ ఔట్ డేటెడ్ డైరెక్షన్ కూడా మేజర్ మైనస్ అయింది. యాక్షన్ పార్ట్ తప్పితే మిగిలిన ఏ సీన్స్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు.
అన్నింటికీ మించి ఛత్రపతిని కాకుండా ఏదైనా హిస్టారికల్, లేదా మైతలాజికల్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా మూవీ చేసి ఉంటే ఈ రిజల్ట్ కన్నా కూడా చాలా బెటర్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చి ఉండేది… ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా ఫ్లాఫ్ కి అనేక కారణాలు ఉంటాయి… మొత్తం మీద బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కోసం కష్టపడ్డా ఫలితం లేక పోవడంతో తన అప్ కమింగ్ మూవీస్ తో ఆడియన్స్ ను మెప్పించడానికి ఇంకా కష్టపడతాను అంటూ రీసెంట్ గా కామెంట్ చేశాడు…