బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ శ్రీవాస్ ల కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత తెరకెక్కిన హాట్రిక్ మూవీ రామ బాణం సమ్మర్ కానుకగా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఆడియన్స్ ను అలరించే విషయంలో మినిమమ్ కూడా అంచనాలను అందుకోలేక పోయింది. దానికి తోడూ గోపీచంద్ ప్రజెంట్ ఫామ్ కూడా ఇబ్బంది పెట్టడంతో ఏ దశలో కూడా టార్గెట్ దిశగా…
వెళ్ళలేక పోయిన ఈ సినిమా చాలా త్వరగానే బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా రిలీజ్ కి ముందే హీరో డైరెక్టర్ ల కాంబినేషన్ వలన నాన్ థియేట్రికల్ బిజినెస్ రేటును సాలిడ్ గానే సొంతం చేసుకోగా…
అందులో సినిమా డిజిటల్ రైట్స్ ను సోనీ లివ్ వాళ్ళు భారీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఆల్ మోస్ట్ 8 కోట్ల రేంజ్ రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకోగా సినిమాను ఇప్పుడు రిలీజ్ అయిన 5వారాలకు అంటే జూన్ 3న డిజిటల్ లో రిలీజ్ చేయబోతున్నారు…
ఆల్ రెడీ సినిమాలో డిలేట్ చేసిన కంటెంట్ లెంత్ ఎక్కువగా ఉండటంతో ఇంత ఫుటేజ్ వేస్ట్ చేశారు అంటూ ట్రోల్స్ ని ఫేస్ చేసిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ లో నష్టాలను భారీగానే సొంతం చేసుకుంది. ఇక డిజిటల్ రిలీజ్ అయ్యాక ఎలాంటి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటుంది, ఎంతవరకు పెట్టిన రేటుకి న్యాయం చేస్తుందో చూడాలి.