Home న్యూస్ రీ రిలీజ్ కానున్న బాలయ్య క్లాసిక్ మూవీ….రిలీజ్ ఎప్పుడంటే!

రీ రిలీజ్ కానున్న బాలయ్య క్లాసిక్ మూవీ….రిలీజ్ ఎప్పుడంటే!

1

ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే, ఒకటి తర్వాత ఒకటి రీ రిలీజ్ లు జరుగుతూ ఉండగా కొన్ని సినిమాలు ఎలాంటి అకేషన్ లేకుండానే రిలీజ్ అవుతున్నాయి, కొన్ని సినిమాలు మాత్రం హీరోల బర్త్ డే టైంలో రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా సింహాద్రి సినిమా రీ రిలీజ్ అవ్వగా ఇప్పుడు త్వరలో…

సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే కానుకగా మోసగాళ్ళకి మోసగాడు సినిమా, సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా అడవి రాముడు సినిమా రిలీజ్ కానుంది. ఇక తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు కానుకగా మరో ఎపిక్ మూవీ రిలీజ్ కి సిద్ధం కానుంది…

మైతలాజికల్ నేపధ్యంలో తెరకెక్కిన ఎపిక్ మూవీ భైరవ ద్వీపం మూవీ ని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు… జూన్ 10న సినిమాను 2K లో అలాగే 4K క్వాలిటీలో మార్చి రిలీజ్ చేస్తామని అఫీషియల్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. క్వాలిటీ పరంగా ఇంప్రూవ్ మెంట్ జరిగితే…

కచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా సినిమాను చూడటానికి థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. మరి ఈ సినిమాను ఎంతవరకు ప్రమోట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకునేలా చేస్తారో చూడాలి ఇప్పుడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here