రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన స్టార్ కిడ్ దగ్గుబాటి అభిరాం హీరోగా తేజ డైరెక్షన్ లో తెరకక్కిన అహింస సినిమాతో లాంచ్ అవ్వగా సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ అవుతూ ఎట్టకేలకు రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ సినిమా మొదటి ఆటకే ఆడియన్స్ నుండి కంప్లీట్ గా నెగటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పెద్దగా ఓపెనింగ్స్ అయితే ఏమి కనిపించలేదని చెప్పాలి ఇప్పుడు. సినిమా మొత్తం మీద భారీ నిరాశనే మిగిలించే అవకాశం ఉండగా సినిమా ఇలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది అని మేకర్స్ కి ముందే తెలుసని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు…
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ తేజ మాట్లాడు…. సినిమా 90% షూటింగ్ అయిన తర్వాత నిర్మాత సురేష్ బాబు గారు ఓవరాల్ గా సినిమా రషెస్ చూసి అసలు ఎందుకు తీసారు ఈ సినిమా ఆపేసి ఉండాల్సింది కదా మీరు సరిగ్గా చేయలేదు అన్నాడని తేజ డైరెక్ట్ గా స్టేజ్ పైనే చెప్పేశారు….
కానీ సినిమాను ఎలాగోలా హిట్ చేయాలనీ కష్టపద్దామని కూడా చెప్పుకొచ్చారు, కానీ సినిమా కోర్ పాయింట్ కంప్లీట్ గా ఔట్ డేటెడ్ అయిపోవడంతో ఆడియన్స్ అసలు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు అనే చెప్పాలి. దాంతో సినిమా మొదటి రోజే ఆడియన్స్ నుండి ఔట్ రైట్ రిజెక్షన్ ను సొంతం చేసుకోవాల్సి వచ్చింది.
ఇటువంటి సినిమాల వల్ల నిర్మాతలు నష్టపోతారు.కథా బలం లేకుండా సామాజిక సమస్యలను పట్టించుకోకుండా ఎక్కడో ఒక పాయింట్ విని సినిమా తీస్తే చివరకు మిగిలింది ఫ్లాఫ్… తేజ గారు ఇప్పుడు పనికిరారు.. వారి డైరెక్షన్ అప్పటి తరం కు సరిపోతుంది ఇప్పుడు కాదు