టాలీవుడ్ లో రీసెంట్ టైంలో రీ రిలీజ్ ల ట్రెండ్ గట్టిగానే సాగుతున్న విషయం తెలిసిందే. ఒక సినిమా తర్వాత ఒక సినిమాను రీ రిలీజ్ చేస్తూ ఉండగా రీసెంట్ గా ఎన్టీఆర్(Jr NTR) సింహాద్రి(Simhadri4K) సినిమాను రీ రిలీజ్ చేయగా ఆ తర్వాత ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ అయింది.
నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ నరసింహా నాయుడు(Narasimha Naidu) సినిమాను రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ చేశారు…. సినిమా ప్రింట్ బాగున్నప్పటికీ…
టీం సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయలేక పోయారు. దానికి తోడూ కొందరికి మాత్రమే సినిమా రీచ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక చేతులు ఎత్తేసింది ఈ సినిమా… రీ రిలీజ్ లో ఈ సినిమా కేవలం 24 లక్షల రేంజ్ లోనే గ్రాస్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమాకి ముందు భారీ షోలు అరేంజ్ చేయాలి అనుకున్నా చేయలేక పోయారు. నైజాంలో రీ రిలీజ్ మూవీస్ లో లోవేస్ట్ షోలు ఈ సినిమాకే పడ్డాయి. ఒక్క సీడెడ్ లోని కొన్ని సెంటర్స్ లో మాత్రమే షోలు డీసెంట్ గా పడగా…
మిగిలిన చోట్ల డిమాండ్ లేకనో లేక ఇతర కారణాల వలనో కానీ సినిమా ఏమాత్రం అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది…. దాంతో బాలయ్యకి రీ రిలీజ్ లో చెన్నకేశవ రెడ్డికి మించి నరసింహా నాయుడు దుమ్ము లేపుతుంది అనుకున్నా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేక పోయింది ఈ సినిమా….