బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ మూవీ స్పై(SPY Movie) భారీ లెవల్ లో ఈ నెల 29న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు…
లాస్ట్ ఇయర్ కార్తికేయ2(Karthikeya2) సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న నిఖిల్ ఆ సినిమా తో టోటల్ రన్ లో ఏకంగా 121 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాస్ మూవీ గా నిలిచింది.
మొత్తం మీద ఇలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ స్పై మూవీ బిజినెస్ పరంగా మరీ భారీ లెవల్ లో బిజినెస్ ను చేయకుండా రీజనబుల్ బిజినెస్ తో అన్ని ఏరియాలలో దూసుకు పోతూ ఉంది ఇప్పుడు. కార్తికేయ2 సినిమా ఆంధ్ర రీజన్ లో మొత్తం మీద…
6 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగా ఇప్పుడు స్పై మూవీ కూడా ఇదే రేంజ్ లో ఇక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. మిగిలిన ఏరియాల బిజినెస్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా ఓవరాల్ గా సినిమా మీద…
డీసెంట్ టు గుడ్ అనిపించే రేంజ్ లో ఎక్స్ పెర్టేషన్స్ ఉండటంతో సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఈ టార్గెట్ ను త్వరగానే అందుకుని మంచి లాభాలను అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా టోటల్ బిజినెస్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.