బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ ని పూర్తీ చేసుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddhartha) నటించిన లేటెస్ట్ మూవీ స్పై(SPY Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వలేదు…
దాంతో కలెక్షన్స్ పరంగా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా… సినిమా బడ్జెట్ పరంగా కూడా నిఖిల్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని అంటున్నారు. ఈ సినిమా కన్నా ముందు చిన్న మరియు…
మీడియం రేంజ్ మూవీస్ చేసిన నిఖిల్ స్పై మూవీ కూడా మీడియం బడ్జెట్ తోనే తెరకెక్కింది అని అందరూ అనుకున్నారు కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాకి అయిన టోటల్ బడ్జెట్ మేకర్స్ అంచనాలు కూడా మించి పోయి ఏకంగా 32 కోట్ల రేంజ్ లో…
బడ్జెట్ తో నిర్మించారని సమాచారం, ఇక సినిమా ప్రింట్స్ అండ్ పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఏకంగా బడ్జెట్ ఏకంగా 36 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… ఈ రేంజ్ లో బడ్జెట్ అంటే ఆల్ మోస్ట్ మీడియం రేంజ్ టు స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ రేంజ్ అని చెప్పాలి.
ఇక ఇక్కడ విశేషం ఏంటి అంటే సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తో చాలా మొత్తాన్ని రికవరీ చేసిందని సమాచారం… బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం మాత్రం సినిమా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా మేకర్స్ ఈ సినిమా ద్వారా మంచి లాభాలే వచ్చినట్లు సమాచారం. ఆ లెక్కలు త్వరలో క్లియర్ గా అప్ డేట్ చేస్తాం….