Home న్యూస్ ఇంకా ఎన్ని సినిమాలు నాశనం చేస్తారో…మరో సినిమా సిద్ధం!!

ఇంకా ఎన్ని సినిమాలు నాశనం చేస్తారో…మరో సినిమా సిద్ధం!!

0

ప్రస్తుతం OTT హెల్ప్ వలన అన్ని ఇండస్ట్రీల సినిమాలు ఇతర ఇండస్ట్రీల ఆడియన్స్ కి కూడా అందుబాటులో ఉన్న టైంలో చాలా వరకు రీమేక్ సినిమాలను ఆపేస్తున్నారు. సౌత్ లో కొన్ని సినిమాలు మినహా రీమేక్ సినిమాలు దాదాపుగా ఆగిపోగా బాలీవుడ్ మాత్రం వరుస పెట్టి…

రీమేక్ సినిమాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నా కానీ ఏమాత్రం తలవంచకుండా మరో రీమేక్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. రీసెంట్ టైంలో బాలీవుడ్ లో ఒక్క దృశ్యం2 సినిమా రీమేక్ తప్పితే ఏ సినిమా కూడా రీమేక్ కూడా హిట్ అవ్వలేదు. దృశ్యం2 కూడా ఒరిజినల్ వర్షన్…

హిందీ లో డబ్ అవ్వకపోవడం కలిసి వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. విక్రమ్ వేద, బచ్చన్ పాండే, భోళా ఇలా చెప్పుకుంటూ పోతే హిందీలో ఫ్లాఫ్ అయిన రీమేక్ లు చాలానే ఉండగా ఇప్పుడు మరో రీమేక్ కి రంగం సిద్ధం చేస్తున్నారు… 

విజయ్(Thalapathy Vijay) మరియు అట్లీ(Atlee) ల కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తెరి(Theri) సినిమా ను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారట. అట్లీ ఈ సినిమాను హిందీలో నిర్మిస్తుండగా హీరోగా పెద్దగా ఫాంలో లేని వరుణ్ ధవన్(Varun Dhawan) ఇందులో నటించబోతున్నట్లు సమాచారం.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోబోతున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం. రీమేక్ లను రీసెంట్ టైంలో ఏమాత్రం బాగా తీయలేక పోతున్న బాలీవుడ్ మరో సినిమాను నాశనం చేసే అవకాశం ఉన్నా అట్లీ నిర్మాత అవ్వడంతో ఎంతో కొంత కేర్ తీసుకుంటాడేమో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here