బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ లో హిస్టారికల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది కానీ తర్వాత విపరీతమైన ట్రోల్స్ ఇంపాక్ట్ వలన సినిమా హోల్డ్ ని చూపించలేక పోయింది…
ఉన్నంతలో ఇతర చోట్ల ఎలాగోలా నష్టాలు తక్కువగానే సొంతం చేసుకునే అవకాశం ఉన్న ఈ సినిమా తెలుగు వర్షన్ ఇప్పుడు హెవీ నష్టాలను సొంతం చేసుకోబోతుంది. ఆ నష్టాలను తగ్గించే ప్రయత్నం సినిమా చేస్తున్నా కూడా ఇక కష్టమే అని చెప్పాలి.
కానీ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ టాగ్ ను కాకుండా యావరేజ్ రేంజ్ టాగ్ ని అయినా సొంతం చేసుకోవడానికి ఒక అవకాశం ఉండగా ఇప్పుడు ఆ మిగిలిన కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడానికి ఒక్కో అడుగు మున్డుకేస్తున్న సినిమా…
17 రోజుల్లో టోటల్ గా 192.69 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 242 కోట్లలో 80% రికవరీ మార్క్ ని అందుకోవాలి అంటే సినిమా టోటల్ గా 193.60 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఈ లెక్కన సినిమా మరో కోటి దాకా షేర్ ని…
మిగిలిన రన్ లో అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా యావరేజ్ టాగ్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ వర్కింగ్ డే లో కొంచం హెవీ డ్రాప్స్ నే మళ్ళీ సొంతం చేసుకుంటున్న ఈ సినిమా ఫైనల్ రన్ లో ఆ కోటి షేర్ ని అందుకుంటుందో లేదో చూడాలి.
Already ippatike 90% theaters LA lo movie lepesaru…yeppufdo boxaffice run mugisindi…ayipoina pelliki bajalu Anna chandangaundi …