Home న్యూస్ 5th డే SPY-సామజవరగమనా కలెక్షన్స్…వర్కింగ్ డే హోల్డ్ ఎలా ఉందంటే!

5th డే SPY-సామజవరగమనా కలెక్షన్స్…వర్కింగ్ డే హోల్డ్ ఎలా ఉందంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddhartha) నటించిన స్పై(SPY Movie) మరియు శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన సామజవరగమనా (SamajaVaragamana) రెండూ కూడా లాంగ్ వీకెండ్ ని పూర్తీ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాయి…

స్పై మూవీ మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపినా కానీ తర్వాత మౌత్ టాక్ ఎఫెక్ట్ వలన స్లో డౌన్ అయిపొయింది. ఇక సామజవరగమనా సినిమా స్లో స్టార్ట్ ని సొంతం చేసుకున్నా కానీ పాజిటివ్ టాక్ పవర్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది.

ఇక రెండు సినిమాలు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా స్పై మూవీ 5వ రోజు వర్కింగ్ డే లో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.. ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇక సామజవరగమనా సినిమా 5వ రోజు 4వ రోజుతో పోల్చితే…

40% రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పర్వాలేదు అనిపించే విధంగా ఉండటంతో సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల నుండి 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక స్పై మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఈ రోజు 26 లక్షల నుండి 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. సామజవరగమనా వరల్డ్ వైడ్ గా కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా స్పై మూవీ 5వ రోజు 35 లక్షల కు పైగా షేర్ ని అందుకోవచ్చు. ఇక 2 సినిమాల 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here