పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి వీకెండ్ లో వీర విహారం అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపినా కానీ…
తర్వాత మాత్రం పెద్దగా జోరు చూపించలేక పోయిన ఈ సినిమా తెలుగు వర్షన్ ఎక్కువగా నిరాశ పరిచింది… కానీ ఇతర భాషల్లో, రాష్ట్రాలలో ఈ టాక్ తో, ఇలాంటి ట్రోల్స్ ని కూడా ఫేస్ చేస్తూ కూడా భారీ వసూళ్ళనే అందుకుని ఒక్కో చోట పరుగును పూర్తీ చేసుకుంటుంది.
రీసెంట్ గా సినిమా కేరళలో రన్ ని కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు కర్ణాటక లో కూడా పరుగును పూర్తీ చేసుకుంది. సినిమా టోటల్ గా ఇక్కడ 16.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను ఇక్కడ సొంతం చేసుకోగా టోటల్ రన్ లో సినిమా ఇక్కడ…
12.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును ఆల్ మోస్ట్ పూర్తీ చేసుకుంది… మొత్తం మీద వాల్యూ బిజినెస్ లో ఇక్కడ సినిమా కి 4.05 కోట్ల రేంజ్ లో నష్టం ఇక్కడ సొంతం అయ్యింది అని చెప్పాలి, ఓవరాల్ గా బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ మూవీస్ ఇక్కడ కూడా…
అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ అయితే చేయలేదు అని చెప్పాలి.. ఆదిపురుష్ ఓపెనింగ్స్ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఉన్నా టాక్ అనుకున్న విధంగా లేక పోవడం, విపరీతమైన ట్రోల్స్ ఇబ్బంది పెట్టకుండా ఉండి ఉంటే సినిమా కచ్చితంగా ఇంకా చాలా బెటర్ కలెక్షన్స్ ని ఇక్కడ కూడా సొంతం చేసుకుని ఉండేది… ఇక ప్రభాస్ సలార్(Salaar) తో ఇక్కడ సంచలనం సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది..