టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి అల్టిమేట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. సినిమా మెగాస్టార్(Megastar Chiranjeevi) కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న…
సినిమాగా సంచలనం సృష్టించగా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా ఈ సినిమా 175 రోజులను ఒక సెంటర్ లో పూర్తీ చేసుకుని సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఉన్న టైంలో ఒక థియేటర్ లోనే అయినా కూడా ఒక సినిమా 175 రోజులు ఆడటం విశేషం అనే చెప్పాలి.
ఇక్కడ ఒక విశేషం ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రీవియస్ 175 డేస్ మూవీ వచ్చి ఏకంగా 21 ఏళ్ళు అవుతుంది. 21 ఏళ్ల క్రితం అంటే 2002 లో రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర(Chiru Indra Movie) ఆల్ మోస్ట్ 240 రోజులకు పైగా…
థియేటర్స్ లో రన్ అయ్యింది… 175 రోజులను కూడా ఘనంగా పూర్తీ చేసుకున్న ఈ సినిమా తర్వాత మిగిలిన చిరు సినిమాలు ఏవి కూడా 175 రోజులను పూర్తీ చేసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఆల్ మోస్ట్ 21 ఏళ్ల తర్వాత సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
175 రోజులను పూర్తీ చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి. ఈ సినిమా అల్టిమేట్ హిట్ తర్వాత మెగాస్టార్ త్వరలోనే భోళా శంకర్(Bhola Shankar) తో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా ఆ సినిమాతో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.