BABY The Movie REVIEW Rating: రీసెంట్ టైం లో చిన్న సినిమానే అయినా పాటలు, ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడంతో యూత్ లో మంచి అంచనాలను పెంచిన సినిమాగా నిలిచింది బేబి మూవీ(Baby The Movie), ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ల కాంబోలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, హైప్ ను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే స్కూల్ టైం నుండి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండే హీరో హీరోయిన్స్ లో హీరో 10th ఫెయిల్ అవ్వడంతో ఆటో నడుపుకుంటాడు. డబ్బున్న అమ్మాయి అయిన హీరోయిన్ తెలివైనది కూడా అవ్వడంతో రిచ్ కాలేజ్ లో సీట్ వస్తుంది. ఆ తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయింది… హీరో హీరోయిన్స్ ఒకటయ్యారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
ఫస్టాఫ్ ఆఫ్ ఇది ప్రజెంట్ యూత్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా, అక్కడక్కడా డైలాగ్స్ కొంచం శృతి మించిలా ఉండటం, కొన్ని సీన్స్ ఫ్యామిలీస్ తో చూసేలా ఉండవు…. కాబట్టి ఇది యూత్ మూవీ అని దృష్టిలో పెట్టుకుని స్టడీస్ చేసే టైంలో యూత్ ఆలోచనలు ఎలా ఉంటాయి అన్న నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా చాలా బాగా మెప్పించింది…
Baby Movie Review – Actors Performance
హీరో కన్నా ముందు వైష్ణవి చైతన్య ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ తో ఫస్ట్ సినిమాతోనే ఫుల్ మార్కులు కొట్టేసింది. తన నటన, పెర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక ఆనంద్ దేవరకొండ నటన పరంగా మరింత మెరుగయ్యాడు. మరో యాక్టర్ విరాజ్ అశ్నిన్ కూడా ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ జస్ట్ ఓకే అనిపిస్తారు…
సంగీతం సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ కాగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ కి తగ్గట్లు బాగా మెప్పిస్తుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా లెంత్ ను తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది కానీ సినిమా లో ఉన్న ఫీల్ ని క్యారీ చేయడానికి లెంత్ ని పెంచారేమో అనిపిస్తుంది. కానీ ఫస్టాఫ్ లో కొంచం, సెకెండ్ ఆఫ్ లో కొంచం లెంత్ తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది….
సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే సాయి రాజేష్ ఎంచుకున్న పాయింట్ బాగుండగా యాక్టర్స్ నుండి ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ ని రాబట్టుకున్నాడు, ఓవరాల్ గా ఓ మంచి ఫీల్ గుడ్ మూవీని ఆడియన్స్ కి అందించాడు…. కానీ లెంత్ ని తగ్గించి ఉంటే బాగుండేది అనిపించింది.
సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, లీడ్ యాక్టర్స్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్, ఫీల్ గుడ్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, కొన్ని చోట్ల డైలాగ్స్ యూత్ చేత విజిల్స్ వేయించాలా ఉండటం, ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవ్వడం లాంటివి ప్లస్ పాయింట్స్ అయితే….
లెంత్ ఎక్కువ అవ్వడం, కథ ఈజీగా గెస్ చేసేలా ఉండటం, కొన్ని సీన్స్ సిల్లీగా అనిపించడం, కొన్ని సీన్స్/డైలాగ్స్ ఫ్యామిలీస్ తో చూసేలా లేకుండటం మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. కానీ సినిమా టార్గెట్ ఆడియన్స్ అయిన యూత్ కి బాగానే కనెక్ట్ అవుతుంది అని చెప్పాలి…దాంతో వాళ్ళకి సినిమా బాగానే నచ్చే అవకాశం ఉండగా…
రెగ్యులర్ ఆడియన్స్ కొంచం ఓపిక చేసుకుని సినిమా చూస్తె ఎబో యావరేజ్ లెవల్ లో అనిపిస్తుంది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ చాలా కష్టంగా సినిమా చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా టార్గెట్ ఆడియన్స్ ను సినిమా బాగానే ఇంప్రెస్ చేయడం, సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నా ఓవరాల్ గా రీసెంట్ మూవీస్ తో పోల్చితే కొంచం డిఫెరెంట్ ఫీలింగ్ తో మనం థియేటర్స్ నుండి బయటికి వచ్చేలా చేస్తుంది బేబి మూవీ… ఓవరాల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 3/5 స్టార్స్…