Home న్యూస్ టిల్లు స్క్వేర్ 1st సాంగ్….24 గంటల్లో ఊరమాస్ రెస్పాన్స్ సామి!!

టిల్లు స్క్వేర్ 1st సాంగ్….24 గంటల్లో ఊరమాస్ రెస్పాన్స్ సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమా డిజే టిల్లు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా అంచనాలను మించి హిట్ అవ్వడంతో పార్ట్ 2 ను అనౌన్స్ చేయగా ఆడియన్స్ ముందుకు ఈ సినిమా…

అతి త్వరలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు… డీజే టిల్లు సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన రామ్ మిరియాల ఈ మూవీకి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం కాగా సినిమా నుండి ఇప్పుడు…

ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫస్ట్ సాంగ్ టికెటే కొనకుండా అంటూ లిరిక్ తో వచ్చిన ఈ సాంగ్ ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది అని చెప్పాలి ఇప్పుడు… లిరిక్స్ మ్యూజిక్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీ అన్నీ కూడా ఎక్స్ లెంట్ గా సెట్ అయ్యాయి అని చెప్పాలి.

ఇక సాంగ్ కి మొత్తం మీద 24 గంటల్లో రీసెంట్ టైంలో రిలీజ్ అయిన కొన్ని పెద్ద సినిమాల సాంగ్స్ 24 గంటల లైక్స్ అండ్ వ్యూస్ కన్నా కూడా ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద 24 గంటల్లో ఈ సాంగ్ కి యూట్యూబ్ లో…

3.47 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 203.2K లైక్స్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది… రీసెంట్ మూవీస్ సాంగ్స్ రెస్పాన్స్ తో పోల్చితే ఇది ఎక్స్ లెంట్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు. సినిమా మీద మంచి హైప్ ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here