బాక్స్ ఆఫీస్ దగ్గర బేబి మూవీ(Baby Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ రెండు వారాలను పూర్తీ చేసుకోబోతుండగా సినిమా నాన్ స్టాప్ గా 12 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూగా కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా….
13వ రోజు మాత్రం వర్షాల వలన స్లో డౌన్ అయింది కానీ లేకుంటే మరోసారి కోటి రేంజ్ లోనే షేర్ ని అందుకుని ఉండేది. ఇక సినిమా 14వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయినా కూడా నైజాంలో వర్షాల వలన ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నప్పటికీ…
ఉన్నంతలో మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తున్న సినిమా 13వ రోజుతో పోల్చితే 14వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 1.4 కోట్ల రేంజ్ లో ఉండగా ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా వరల్డ్ వైడ్ గా 68.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోబోతుందని చెప్పాలి.
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఒక్క 13వ రోజు మాత్రం హెవీ వర్షాల వలన తగ్గగా 14వ రోజు తిరిగి జోరు చూపిస్తే ఈ రోజు టోటల్ కలెక్షన్స్ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా మొత్తం మీద 2 వారాల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.