బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ లో సౌత్ ఇండియా బిగ్ రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్(RajiniKanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer Movie) మీద ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ టైం లో రజినీ మూవీస్ లో బెస్ట్ బజ్ అండ్ ట్రెండ్ ను…
సొంతం చేసుకున్న సినిమాగా చెప్పొచ్చు ఈ సినిమాని… దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా భారీ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా పక్క రాష్ట్రం కర్ణాటకలోని బెంగుళూరు ఏరియా లో ఆల్ టైం రికార్డ్ షోలతో దుమ్ము లేపింది…
అక్కడ రీసెంట్ టైంలో కన్నడ పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ చాప్టర్2(KGF Chapter2) మూవీ కి ఏకంగా మొదటి రోజు 1037 షోలు పడగా నాన్ లోకల్ మూవీస్ లో అవతార్2(Avatar The Way Of Water) మూవీ కి ఏకంగా 1014 షోలు పడి ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది.
ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ అన్ని రికార్డులను బ్రేక్ చేసి మొదటి రోజుకి గాను ఏకంగా 1093 షోలను సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను సృష్టించడం విశేషం. సినిమా కి ఓవరాల్ గా కర్ణాటకలో ఎక్స్ లెంట్ గా ప్రీ బుకింగ్స్ జరుగుతూ ఉండగా…
అక్కడ తమిళ్ మూవీస్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సినిమా అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా కి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ బజ్ ఉండగా ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరం అని చెప్పాలి.