బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్న కొత్త సినిమా భోలా శంకర్(Bhola Shankar) సినిమా శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
సినిమా మీద ఆడియన్స్ లో ప్రస్తుతానికి వాల్తేరు వీరయ్య తో పోల్చితే తక్కువ అంచనాలు ఉండగా సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని జోరు చూపించి కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక సినిమా బిజినెస్ లెక్కలను గమనిస్తే మేకర్స్ వాల్తేరు వీరయ్య లాంటి హిట్ తర్వాత వస్తున్న సినిమా అయినా కూడా ఎక్కడా అత్యాశకి వెళ్ళకుండా రీజనబుల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం అయ్యేలా చేశారని చెప్పాలి ఇప్పుడు. ఒకసారి ఏరియాల వారి బిజినెస్ లెక్కలను గమనిస్తే…
Bhola Shankar WW Business(Valued)
👉Nizam: 22Cr
👉Ceeded: 12Cr
👉UA: 9.50Cr
👉East: 6.20Cr
👉West: 4.40Cr
👉Guntur: 6Cr
👉Krishna: 4.50Cr
👉Nellore: 3Cr
AP-TG Total:- 67.60CR
👉KA+ROI: 5Cr
👉OS – 7Cr
Total WW: 79.60CR( Break Even – 80.50CR+)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమం 80.50 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. సినిమా టాక్ పాజిటివ్ గా ఉంటే ఇండిపెండెన్స్ వీకెండ్ లో చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.