Home న్యూస్ రీ రిలీజ్ ల గొడవ…18న ఏం జరుగుతుందో ఏంటో!!

రీ రిలీజ్ ల గొడవ…18న ఏం జరుగుతుందో ఏంటో!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ పీక్ లెవల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ టైంలో సింహాద్రి, ఈనగరానికి ఏమైంది, ఆరెంజ్, తొలిప్రేమ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu) బిజినెస్ మాన్(Businessman4K) సినిమాలు….

రీ రిలీజ్ అయ్యి సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా ఖుషి లాంటి సినిమా ఎపిక్ సక్సెస్ గా నిలిచింది…ఇక బిజినెస్ మాన్ ఇప్పుడు మాస్ రచ్చ థియేటర్స్ లో చేస్తూ ఉండగా ఇప్పుడు వచ్చే వారంలో మరో 2 సినిమాలు రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి.

అందులో ఒకటి భారీ హిట్ గా నిలిచిన డబ్బింగ్ మూవీ అయిన రఘువరన్ బి టెక్(RaghuvaranBTech కాగా మరోటి ప్రభాస్(Prabhas) నటించిన యోగి(Yogi)సినిమాలు… ప్రభాస్ ఫ్యాన్స్ చత్రపతి, బుజ్జిగాడు లాంటి సినిమాల రీ రిలీజ్ ల కోసం ఎదురు చూస్తూ ఉండగా…

యోగి లాంటి ఫ్లాఫ్ మూవీ ని రీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు, అది కూడా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న రఘువరన్ బి టెక్ లాంటి సినిమాకి పోటిగా రిలీజ్ చేస్తూ ఉండటంతో ఫ్యాన్స్ ఒక పక్క మాకు ఈ సినిమా వద్దూ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉండగా…

రఘువరన్ లాంటి న్యూట్రల్ ఆడియన్స్ లో మంచి డిమాండ్ ఉన్న సినిమా కి పోటిగా యోగి సినిమా అంటే భారీ ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అనుకోవచ్చు. ఈ పోటి లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here