Home న్యూస్ భోలా శంకర్ బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత రావొచ్చు…మైండ్ బ్లాంక్ సామి!

భోలా శంకర్ బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత రావొచ్చు…మైండ్ బ్లాంక్ సామి!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bhola Shankar) ఆడియన్స్ ముందుకు భారీగా శుక్రవారం రిలీజ్ కాబోతుంది, వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత…

మెగాస్టార్ నుండి వస్తున్న సినిమానే అయినా కూడా ఎందుకో బజ్ పరంగా భోలా శంకర్ పెద్దగా జోరు చూపించలేదు… సినిమా మొత్తం మీద 80.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వరల్డ్ వైడ్ గా సుమారు 1500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సినిమా ఓవరాల్ గా…

తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేయగా ఆంధ్రలో టికెట్ హైక్స్ పర్మీషన్ కోసం లేట్ చేసినా పర్మీషన్ రాకపోవడంతో నార్మల్ రేట్స్ తోనే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నైజాంలో సినిమా బుకింగ్స్ మెగాస్టార్ రీసెంట్ మూవీస్ లో లోవేస్ట్ గా ఉన్నాయని చెప్పాలి.

ఆల్ మోస్ట్ గాడ్ ఫాదర్ కి సిమిలర్ గానే ట్రెండ్ అవుతున్నా కొన్ని చోట్ల బుకింగ్స్ తక్కువగానే ఉన్నాయి. దాంతో సినిమా మేజర్ గా ఇప్పుడు మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కి సిద్ధం అవుతుంది, ప్రజెంట్ బుకింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్…

గాడ్ ఫాదర్ కి సిమిలర్ గానే 12 కోట్ల నుండి 13 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని అనిపించేలా బుకింగ్స్ ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా 16-18 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు అనిపిస్తుంది…

వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇది చాలా నిరాశ కలిగించే ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. కానీ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే షో షోకి కలెక్షన్స్ లో ఇంప్రూవ్ మెంట్ ఉండే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి కలెక్షన్స్ అంచనాలను మించిపోవచ్చు. మరి సినిమా మొదటి రోజు వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here