Home న్యూస్ రికార్డులను అన్నీ తొక్కి పడేసిన బిజినెస్ మాన్…సూపర్ స్టార్ ఊచకోత!!

రికార్డులను అన్నీ తొక్కి పడేసిన బిజినెస్ మాన్…సూపర్ స్టార్ ఊచకోత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన బిజినెస్ మాన్ (Businessman4K) సినిమాను రీసెంట్ గా రీ రిలీజ్ చేయగా సినిమా ఊచకోత కోసే ఓపెనింగ్స్ ను అన్ని చోట్లా సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రీ రిలీజ్ మూవీస్ లో సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా నైజాంలో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయగా మిగిలిన ఏరియాల్లో కూడా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 4.37 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయగా మొదటి రోజు మొత్తం మీద ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Businessman4K Re Release 1st Day AP-TG Collections
👉Nizam – 2.46CR
👉Ceeded – 35L
👉UA: 42L
👉East: 34L
👉West: 15L
👉Guntur: 31L
👉Krishna: 27L
👉Nellore: 7L
👉AP-TG Total Collections – 4.37CR~ GROSS

ఇక సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో టాప్ కలెక్షన్స్ మూవీస్ లో ఇది వరకు జల్సా 2.57 కోట్ల గ్రాస్ ను, సింహాద్రి 2.90 కోట్ల గ్రాస్ ను అందుకోగా ఖుషి సినిమా 3.62 కోట్ల గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన బిజినెస్ మాన్ కొత్త రికార్డ్ ను నమోదు చేసి దుమ్ము లేపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here