Home న్యూస్ BRO- 98.50 కోట్ల టార్గెట్…19 రోజుల్లో వచ్చింది ఇది!!

BRO- 98.50 కోట్ల టార్గెట్…19 రోజుల్లో వచ్చింది ఇది!!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) సినిమా రెండు వారాలను పూర్తి చేసుకున్న తర్వాత కొత్త సినిమాల వలన ఆల్ మోస్ట్ థియేటర్స్ ని కోల్పోయినా కూడా భోలా శంకర్(Bholaa Shankar) ఫ్లాఫ్ రిజల్ట్ వలన…

కొన్ని సెంటర్స్ లో తిరిగి బ్రో మూవీ ని థియేటర్స్ లో ప్రదర్శించగా సినిమా కి ఇండిపెండెన్స్ హాలిడే రోజున మంచి కలెక్షన్స్ సొంతం అయ్యాయి. 2 వారాల తర్వాత 18వ రోజు వరకు సినిమా మొత్తం మీద 12 లక్షల దాకా షేర్ ని అందుకుంటే తర్వాత ఇప్పుడు…

19వ రోజు మాత్రం ఇండిపెండెన్స్ హాలిడే రోజున సినిమా ఏకంగా 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఉన్నంతలో ఇది డీసెంట్ గ్రోత్ కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇది ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా ఇప్పుడు…

19 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
BRO The Avatar 19 Days WW Collections Report
👉Nizam: 21.01Cr(inc GST)
👉Ceeded: 6.97Cr
👉UA: 6.96Cr(inc GST)
👉East: 4.88Cr(inc GST)
👉West: 4.40Cr(inc GST)
👉Guntur: 4.55Cr(inc GST)
👉Krishna: 3.54Cr(inc GST)
👉Nellore: 1.79Cr(inc GST)
AP-TG Total:- 54.10CR(85.75CR~ Gross)
👉KA+ROI: 6.25Cr
👉OS: 7.30Cr
Total World Wide: 67.65CR(114.00CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 98.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 30.85 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉండగా ఫైనల్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here