కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) జైలర్(Jailer) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని పూర్తి చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి తిరిగి ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గానే హోల్డ్ ని చూపిస్తూ లాభాలను ఇంకా పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ కనిపించినా కూడా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి. అయినా కానీ ఓవరాల్ గా హోల్డ్ డీసెంట్ గా ఉండటంతో ఈ రోజు డీసెంట్ షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…
అటూ ఇటూగా ఈ రోజు సినిమా 1 కోటి రేంజ్ నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలు మించిపోతే ఈ షేర్ ఇంకా పెరగవచ్చు. ఇక సినిమా తమిళ్ లో ఈ రోజు అటూ ఇటూగా 3.5 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి ఈ రోజు టోటల్ గా ఇప్పుడు అటూ ఇటూగా 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే…
అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే ఈ గ్రాస్ లెక్క ఇంకా పెరగవచ్చు. సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ 12వ రోజున హోల్డ్ చేయబోతుంది. ఇక సినిమా టోటల్ గా 12 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.