Home న్యూస్ 8 నెలలో 4 సినిమాలు….కానీ అన్నీ అట్టర్ ఫ్లాఫులే!!

8 నెలలో 4 సినిమాలు….కానీ అన్నీ అట్టర్ ఫ్లాఫులే!!

0

2023 ఇయర్ మొదలు అయ్యి ఆల్ మోస్ట్ 8 నెలలు కావోస్తూ ఉండగా ఇప్పటి వరకు చాలానే సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో మన హీరోలలో ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు తక్కువ మందే ఉండగా మొత్తం మీద ఒక హీరో మాత్రం ఈ ఇయర్ 8 నెలలు పూర్తి అయ్యే టైంకే…

అందరు హీరోలలో అత్యధిక సినిమాలు ఈ ఇయర్ లో ఇప్పటికే రిలీజ్ చేశాడు… కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆ సినిమాలలో ఒక్కటి కూడా హిట్ గీతని అందుకోలేక పోయింది. అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం విచారకరం..

ఆ హీరో మరెవరో కాదు… యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh Shobhan)…ఈ ఇయర్ స్టార్టింగ్ లో కళ్యాణం కమనీయం(Kalyanam Kamaneeyam) సినిమాతో మొదలు పెట్టగా తర్వాత వెంటనే శ్రీదేవి శోభన్ బాబు(Sridevi Shobhan Babu) సినిమాతో రాగా ఈ సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ ను…

సొంతం చేసుకున్న తర్వాత సమ్మర్ లో కొంచం మంచి అంచనాలను క్రియేట్ చేసిన అన్నీ మంచి శకునములే( Anni Manchi Shakunamule) సినిమాతో వచ్చినా అంచనాలను ఆ సినిమా అందుకోలేక పోయింది. ఇక ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా సంతోష్ శోభన్ నటించిన….

కొత్త సినిమా ప్రేమ్ కుమార్(Prem Kumar) సినిమా రిలీజ్ అవ్వగా ఈ సినిమాను ఆడియన్స్ అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో ఈ సినిమా కూడా మరో ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఈ ఇయర్ 4 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి అన్ని సినిమాలతో ఫ్లాఫ్ రిజల్ట్ నే సొంతం చేసుకున్నాడు ఈ హీరో…తన అప్ కమింగ్ మూవీస్ తో హిట్ కొడతాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here