Home న్యూస్ బాయ్స్ హాస్టల్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

బాయ్స్ హాస్టల్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

కన్నడ లో రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే(Hostel Hudugaru Bekagiddare) సినిమాని తెలుగులో ఇప్పుడు బాయ్స్‌ హాస్టల్‌(Boys Hostel) పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. మరి సినిమా ఇక్కడ ఎలా ఉంది ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

ఒక బాయ్స్ హాస్టల్…ఆ హాస్టల్ వార్డెన్ చాలా స్ట్రిక్ట్…. ఆ వార్డెన్ పని పట్టాలని చూసే కుర్రాళ్ళు…కానీ అనుకోకుండా ఆ హాస్టల్ వార్డెన్ చనిపోతాడు… ఆ తర్వాత హాస్టల్ కుర్రాళ్ళు ఏం చేశారు…అసలు వార్డెన్ ఎలా చనిపోయాడు ఆ కథ ఏంటి అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….

కొన్ని సినిమాలకు లాజిక్ లు వెతకాలి, కొన్ని సినిమాలకు లాజిక్ లు లాంటివి వెతకకుండా చూడాలి. ఈ రెండో కోవకి చెందిన సినిమానే బాయ్స్ హాస్టల్(Boys Hostel Telugu Review And Rating) సినిమా… నటీనటులు మనకు చాలా వరకు తెలియని వాళ్ళు…. అందరూ స్టూడెంట్స్…

కాలేజ్ యూత్ వయసులో ఎలా ఉంటారు, హాస్టల్స్ లో ఎలాంటి అల్లరి చేస్తారు ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇలాంటివి అన్నీ పరిగణలోకి తీసుకుంటే యూత్ కి ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంటుంది, కామెడి సీన్స్ తో నిండిపోయిన ఈ సినిమా సింగిల్ లైన్ పంచులు….

ఎక్స్ లెంట్ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో ఫస్టాఫ్ బాగా మెప్పించగా సెకెండ్ ఆఫ్ కొంచం గ్రాఫ్ తగ్గిపోగా మళ్ళీ తిరిగి క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే ఇంప్రెస్ చేసి ఓవరాల్ గా మంచి కామెడీ ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో థియేటర్స్ బయటికి వచ్చేలా చేస్తుంది…ఇదంతా లాజిక్ లు వెతకకుండా చూస్తె…

లాజిక్ లు వెతికి ఈ కామెడీ సీన్స్ ఏంటి ఇలా ఉన్నాయి అంటూ వెతకడం స్టార్ట్ చేస్తే సినిమా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది. కానీ యూత్ ని టార్గెట్ చేసిన ఈ సినిమా వాళ్ళకి బాగా నచ్చే అవకాశం ఎంతైనా ఉంది… కొంచం లెంత్ ని తగ్గించి ఉంటే…

ఇంకా క్రిస్ప్ గా మెప్పించి ఉండేది బాయ్స్ హాస్టల్ మూవీ… ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా లాజిక్స్ లాంటివి వెతికే పని పెట్టుకోకుండా థియేటర్స్ లో కూర్చుంటే 2 రెండున్నర గంటల్లో చాలా వరకు ఎంటర్ టైన్ మెంట్ తో మెప్పిస్తుంది ఈ సినిమా… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here