Home న్యూస్ బాయ్స్ హాస్టల్ వీకెండ్ కలెక్షన్స్….బానే వచ్చాయిగా!!

బాయ్స్ హాస్టల్ వీకెండ్ కలెక్షన్స్….బానే వచ్చాయిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ నుండి తెలుగు లోకి డబ్ అయ్యి రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ బాయ్స్ హాస్టల్(Boys Hostel Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా కాలేజ్ యూత్ ని బాగానే అట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమా ఉన్నంతలో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుని…

పర్వాలేదు అనిపించేలా రెండు రోజుల షార్ట్ వీకెండ్ లో బాగానే పెర్ఫార్మ్ చేసిందని చెప్పాలి ఇప్పుడు. సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా అందులో పెయిడ్ ప్రీమియర్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి.

ఇక సినిమా ఆదివారం రోజున మరోసారి మంచి హోల్డ్ ని చూపించిన సినిమా ఆల్ మోస్ట్ 50 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను వసూల్ చేయగా టోటల్ గా వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో కోటి రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ప్రీమియర్స్ అండ్ 2 డేస్ కలెక్షన్స్ తో 1.2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా. అందులో వర్త్ షేర్ అటూ ఇటూగా 55 లక్షలకు పైగా ఉంటుందని అంచనా… సినిమా బిజినెస్ లెక్కలు ఏవి కూడా క్లియర్ గా…

చెప్పలేదు కానీ వాల్యూ బిజినెస్ రేంజ్ 1.75 కోట్ల దాకా ఉంటుందని అంచనా… దాంతో సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తే హిట్ మూవీగా చెప్పుకోవచ్చు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here