యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఏ 1 ఎక్స్ ప్రెస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుండే కొంచం అండర్ పెర్ఫార్మ్ చేస్తూ వస్తుంది, సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ ఓపెనింగ్స్ లభించినా కానీ అవి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకునే రేంజ్ లో లేక పోవడంతో వర్కింగ్ డేస్ పై ఇంపాక్ట్ పడింది.
ఇక సినిమా తేరుకోవడం కష్టమే అనుకున్న టైం లో వర్కింగ్ డేస్ లో సినిమా సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుండటం విశేషం, రెండు తెలుగు రాష్ట్రాలలో వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ చాలా తక్కువగా ఉండటం ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేసే అవకాశం ఉందని చెబుతుంది, సినిమా 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 44 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా, 5 వ రోజు 37 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, అంటే డ్రాప్స్ కేవలం 20% లోపే ఉన్నాయి అని చెప్పాలి.
ఇక సినిమా మొత్తం మీద 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 91L
👉Ceeded: 30L
👉UA: 44L
👉East: 32L
👉West: 23L
👉Guntur: 28L
👉Krishna: 28L
👉Nellore: 19L
AP-TG Total:- 2.95CR (5.19Cr Gross~)
Ka+ROI: 10L
Os – 8L
Total WW: 3.13Cr(5.60cr Gross~)
ఇదీ సినిమా మొత్తం మీద 5 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్…కానీ…
సినిమా బిజినెస్ 4.6 కోట్లు కాగా సినిమా బ్రేక్ ఈవెన్ కి 5 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, 5 రోజుల తర్వాత సినిమా మరో 1.87 కోట్ల షేర్ ని అందుకుంటే హిట్ అవుతుంది, ఇక 7 వ రోజు నుండి 4 కొత్త సినిమాలు ఉన్న నేపధ్యంలో సినిమా రెండో వారంలో ఎలా హోల్డ్ చేస్తుంది అన్నదానిపై సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చెప్పగలం…