Home న్యూస్ జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్, రాబర్ట్…థియేటర్స్..బుకింగ్స్…1st డే ప్రిడిక్షన్!!

జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్, రాబర్ట్…థియేటర్స్..బుకింగ్స్…1st డే ప్రిడిక్షన్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ 11 న ఏకంగా 4 నోటబుల్ మూవీస్ బాక్స్ ఆఫీస్ బరిలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి, మూడు స్ట్రైట్ మూవీస్ కాగా ఒక డబ్బింగ్ మూవీ, ఇక ఏ సినిమా రేంజ్ లో అవి మంచి బిజినెస్ లనే సొంతం చేసుకున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నాలుగు సినిమాల టోటల్ థియేటర్స్ కౌంట్ లెక్కలను ఒకసారి గమనిస్తే… అన్ని సినిమాలలోకి హైయెస్ట్ బిజినెస్ ను సాధించిన…

శర్వానంద్ శ్రీకారం సినిమా నైజాం ఏరియాలో ఏకంగా 205 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా టోటల్ రెండు తెలుగు రాష్ట్రాలలో 535 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది, ఇక తర్వాత శ్రీ విష్ణు నటిస్తున్న గాలి సంపత్ మూవీ నైజాం ఏరియాలో 141 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా…

410 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది, ఇక చిన్న సినిమానే అయినా సెన్సేషనల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న జాతితర్నాలు నైజాంలో 110 థియేటర్స్ లో టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 390 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది, ఇక డబ్బింగ్ మూవీ రాబర్ట్ నైజాం లో 55 థియేటర్స్ లో..

టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 180 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.. ఇక అన్ని సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయినా జాతితర్నాలు ఒక్కటే నెక్స్ లెవల్ లో జరుగుతున్నాయి, మిగిలిన సినిమాలు అన్నీ కూడా జస్ట్ బిలో యావరేజ్ లెవల్ లోనే ప్రజెంట్ ఉన్నాయి అండ్ అవన్నీ మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యాయి అని చెప్పాలి…

ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే…జాతితర్నాలు అవలీలగా 3-4 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు, ఇక శ్రీకారం కూడా అదే రేంజ్ లో ఓపెన్ అవ్వొచ్చు, ఇక గాలి సంపత్ 1.5 కోట్ల రేంజ్ ని టచ్ చేయోచ్చు ఇక రాబర్ట్ సినిమా 30-35 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ సాధించవచ్చు, టాక్ ని బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా పెరగడమో లేక తగ్గడమో జరుగుతుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here