టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో డిసాస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. భారీ నష్టాలను సొంతం చేసుకున్న ఈ సినిమా ను కొన్న బయ్యర్లకి ఇప్పటికీ నష్టాల సెటిల్ మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. డైరెక్టర్ అయినా కొరటాల శివ బిజినెస్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో….
ఇప్పుడు భారీ రేట్లకి కొన్న బయ్యర్లు నష్టాలను పూడ్చాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆల్ రెడీ కొన్ని సార్లు మీటింగ్ లు జరగగా పెద్దగా ఇంపాక్ట్ లేక పోవడంతో సీడెడ్ అలాగే ఇతర ఏరియాల బయ్యర్లు రీసెంట్ గా కొరటాల ఇంటి ముందు రాత్రి నుంచి ఆఫీసు దగ్గర బైఠాయించారని సమాచారం….
15 కోట్ల నష్టానికి ఎంత వెనక్కు ఇస్తారో తేల్చాలని లేదంటే మెగాస్టార్ ఇంటి ముందు బైఠాయిస్తామంటూ గొడవ చేశారట…. తెలుగు రాష్ట్రాలలో ఆచార్య భారీ నష్టాలను సొంతం చేసుకోగా కొందరికీ కొంత మొత్తం వెళ్ళినా ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ గొడవలు మొదలు అవ్వడంతో ఇక కొరటాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది.