మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ఆచార్య, చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఫస్ట్ వేవ్ వలన ఆగి పోగా ఈ ఇయర్ సెకెండ్ వేవ్ వలన సమ్మర్ రిలీజ్ అవ్వాల్సింది మళ్ళీ ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు సినిమా…
రిలీజ్ డేట్ అనేది చెప్పకుండా ఎప్పుడు వస్తుందో అన్న క్లారిటీ కూడా ఇన్ని రోజులు ఇవ్వలేదు, డిసెంబర్ 17 న సినిమా పుష్ప కి పోటిగా వస్తుంది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు వాటికన్నింటికీ చెక్ పెడుతూ సినిమా రిలీజ్ ను ఏకంగా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు.
కానీ ఇక్కడే టీం అందరికీ భారీ షాకిచ్చారు అని చెప్పాలి. ఏదైనా మంచి వీకెండ్ హాలిడేస్ ఉండేలా ప్లాన్ చేసుకుని సినిమాను రిలీజ్ చేస్తారేమో అనుకుంటే అసలు ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని డేట్ కి సినిమాను అనౌన్స్ చేశారు. టాలీవుడ్ లో అన్ సీజన్ గా భావించే నెలలలో…
ఫిబ్రవరి, మార్చ్, నవంబర్ లాంటి నెలలు ముందు ఉంటాయి… ఇప్పుడు ఆచార్య సినిమా ఫిబ్రవరిలో 4 వ తేదీనా ఆడియన్స్ ముందుకు రాబోతుందని అఫీషియల్ పోస్టర్ తో కన్ఫాం చేశారు. దాంతో అసలు ఆ డేట్ ఏంటి ఎవ్వరూ ఊహించని నార్మల్ రిలీజ్ కి సిద్ధం అవ్వడం ఏంటి అంటూ ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. కానీ సమ్మర్ లో చాలా సినిమాలు రిలీజ్ కి ఉండటంతో…
అప్పుడు సోలో రిలీజ్ దొరికేలా లేదు కాబట్టి ఫిబ్రవరి మొదటి వారాన్ని సోలో రిలీజ్ గా ఎంచుకోవాల్సి వచ్చింది అంటున్నారు. ఇక్కడ ఒక్క పాజిటివ్ విషయం ఏంటంటే ఫిబ్రవరి ఎంత అన్ సీజన్ అనుకున్నా ఈ ఇయర్ ఉప్పెన సంచలన కలెక్షన్స్ ని సాధించింది… దాంతో వచ్చే ఫిబ్రవరికి బాక్స్ ఆఫీస్ ను ఆచార్య ఓ రేంజ్ ఓ షేక్ చేస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు అందరు…